My Lyrics

సాయి స్తుతి

ద్వారకమాయిలో జగమేలు సాయి
చల్లన్ని చూపంట చక్కన్ని రూపంట, వెన్నంటి మనసంట కరుణించు గుణమంట
దత్తుడి రూపమే దిగి వచ్చె సద్గురై
భయమంటె సెలవంట, అభయాల నెలవంట, తానoటె ప్రేమంట, ప్రేమంటె మనమంట
రవి శశి కాంతులే తనలో మెరవగా
ఈ పంచ భూతాలే తననే చేరగా
ముక్కోటి దేవతలు ఒక్కటై సాయిగా
అవతరించి రీ భువి పై ఆశ్రితులను కాపాడగ                            !!ద్వారక మాయిలో!!



సంద్రానికి సైతం ఉంటుందొక తీరం

నీకరుణకు ఎక్కడుంది స్వామీ ఆ తీరం?
ప్రతివాడిలొ కోపం ఎదో ఒక రూపం
నీ మోమున ఏమూలన లేదయ్యా ఆ లోపం
ఆదిలోన సాయి అంటె తెలియని ఈ దీనునికి, సాయిలోని హాయి చూపి నీవాడిగ చేసితివి
కష్టకాలమందు నన్ను కంటి రెప్ప లా చూసి, చెప్పలేని తీర్చలేని ఋణ పాత్రుణి చేసితివి
శతకోటి వందనములు సాయి నీ చరణములకు
కరుణించి ఈ దీనుని కాపాడగ కదలిరావ?                             !!ద్వారక మాయిలో!! 



నినుకొలిచిన పూవులు సిరులై మము చేరును
నీ దీవనలకు సరితూగే సిరులేవి ఉండవులే
మే చేసిన ప్రార్థనలు వరములు గా సిద్ధించును
కలవరములు కడతేరును స్వామీ నీ కరుణతో
లోకమందు నిన్ను మించి బంధువు ఎవరుంటారని, నీదు పాదపద్మ మందు నా హృదయము కొలువుంచి
కాళ్ళ నుండి వెల్లివిరుయు గంగమ్మను  నే తాకి, చేసిఉన్న పాపమంత  తొలిగిపోవు తరుణముకై
శతకోటి నేత్రములతొ నే వేచి చూచు చుండ
దయతోడ ఈ దాసుని దరిచేర్చగ కదలిరావ?                              !!ద్వారక మాయిలో!! 


Telangana misses you sir

జయహొ జయహో నీకు జయశంకరా
తల్లి తెలంగాణ కన్నట్టి ఓ కీర్తి శేఖర
  

అక్కంపేట ఆ ఆత్మకూరు ప్రాంతం
ఏనాడు చేసినా పుణ్యఫలమోగాని
ఆల్చిప్ప నొదిలేసి అలల లాలననొదిలి
ఆణిముత్యము ఒకటి ఈచోట చేరెను


అర్థశాస్త్రము చదివి ఆచార్యుడయ్యి
అర్థమే చేయించి అభ్యుదయ పరిచి
అర్థము పదవులను ఆశించకుండానె
అర్థవంతమైన జీవితమె గడిపితివి


ధనికుడు దళితుడు పేద బీదలు అంటు
అడ్డుగోడలు లేని ప్రేమనే పంచితివి
అసమానతల స్వార్థ కోరల్లొ చిక్కుకుని
నలిగిపోయే తల్లి విముక్తికై పోరితివి


క్యాన్సరే కబళించినా నిన్ను ఆచార్య
కాంక్షనే కబళించ సాధ్యమవునా అయ్య
నీలోని ఆశయము ప్రతి ఉసురులో చేర
నిస్వార్థ పోరాటమే చేసి నెగ్గెదము


జయహొ జయహో నీకు జయశంకరా
తల్లి తెలంగాణ కన్నట్టి ఓ కీర్తి శేఖర
  

పితృ దేవోభవ

పితృ దేవోభవ అని, పలుమార్లు స్తుతించి, జీవనం పావనం కానీ
గుండె నిండున్న మానాన్న రూపాన్ని ధ్యాన్నించి శిరసొంచి ప్రణమిల్లనీ
కోపం వచ్చిందా ముక్కంటికి మరో రూపు
ప్రేమే పొంగిందా హద్దన్నది లేనే లేదు
ఈ మమతల సౌధానికి ఆలంబన నాన్నా నువ్వు
నీ చల్లని దీవెనలు శ్రీరామ రక్షే మాకు                                                             !!పితృ దేవోభవ!!

వేలుపట్టి నడిపినా జుట్టు పట్టి కొట్టినా
అంతా నా మంచికి నువు సలిపిన కృషి కాదా
ముద్దులెన్నొ పెట్టినా రెట్టింపుగ తిట్టినా
అంతా నాకొరకే అని మరువగ నే మనిషినా
కరుకగు మేఘం వెనువెంటనె చల్లని వర్షం
దురుసగు కోపం తెరవెనకే ప్రేమల తీరం
చెబుతున్న ఈ మాటను నాన్నా పది మందిలో
వద్దన్న కొడుకై నే పుడతా ప్రతి జన్మ లో                                                          !!పితృ దేవోభవ!!

ఉలితో కొట్టకుండా మెరుగులనే దిద్దకుండా
శిల శిల్పంగా మారుట సాధ్యమైన పనికాదుగ
చెడునే తృంచకుండా సన్మార్గము చూపకుండా
దృతరాష్ట్ర ప్రేమలతో లక్ష్య సాధనే కల్లని
భావించావు తప్పులనే సరిదిద్దావు
వెదురగు నన్ను వేణువుగా మార్చేసావు
అందుకె నువ్వందుకొ నా శతకోటి వందనాలు
అంతెరగని ఋణ సాగర మునకలొ ఓ చిరు పాలు                                               !!పితృ దేవోభవ!!

మంగళ హారతి నీకిదే, రాజరాజేశ్వర

మంగళ హారతి నీకిదే, రాజరాజేశ్వర మా
మంగళ హారతి నీకిదే,
మంగళ హారతి నీకిదె, మహిమల మహిత మహదేవా (2)
స్వర సుధల మధుర కీర్తనలు ఈశ్వర
విశేశ్వర, హర, సన్నుతి సేయగ                                                  !!మంగళ!!


బంతులు చేమంతులన్ని ఎంతెంతో దయ గల వాడని, (2)
సంతసమే నిండిన అంతరంగములతో నిన్నే కొలవగ                      !!మంగళ!!
వెంటనే ఉండి స్వామి కరుణిచవోయి అంటే (2)
వెంటనే వడి వడిగ వచ్చి, సంకటాలె తీర్చెడి స్వామి                         !!మంగళ!!


గరళము నువ్వే మింగి, గండములు అన్నిటిని బాపి(2)
గతిలేని మా బ్రతుకులకు, సత్గతులనే సిద్దించిన స్వామి                    !!మంగళ!!
శంకరుడే దైవం అని నిరతము నిన్నే నమ్మి (2)
ధ్రుడముగ మదిలోనా నిలిపిన, మా తాత మాణిక్యుణి సాక్షిగా            !!మంగళ!!


ఉదయాన్నే లేచీ స్వామీ హర హర యనీతలచి(2)
ధర్మామే యే వేళా తప్పని, మొకిరాల ముత్తయ్య మనవడి                !!మంగళ!!
యేజన్మలో నో స్వామీ, యేపుణ్య ఫలమో కాని(2)
ఈ తల్లి తండ్రులకు నన్ను, పుట్టించి చెరితార్థుని చేసిన స్వామి             !!మంగళ!!

Life ఎంతొ చిన్నది :) :) :)

Life ఎంతొ చిన్నది, రేపటికై దిగులొద్దని
గొంతెత్తి చాటని, ప్రతి గళమూ దీన్నే పలకని
Smile ఉంటే face కి, sunscreenలు గట్ర waste అని
గుర్తించేయ్ కిటుకుని, మార్చేసేయ్ నీ route ని
ఆనందం నీవెంటే, ఉంటానంటూ ఉంటే,
ఆహ్వానం పలకక నీకు దేనికి చెప్పు రెండో thought?                                !!Life ఎంతొ చిన్నది!!

చిరునవ్వె గా మనసుకు మనసుకు వంతెన వేసే harmony
దరహాసాలే problems అన్ని solve చేసేటి symphony
ఏడిస్తే వచ్చేదేంటి, జగమంత cacophony 
కళ్ళంతా ఎర్రగ మారి, hOgaa yaar zindagi gloomy
కిలకిలమని నవ్వుతు ఉంటే, బ్రతుకంతా నిండును honey
బాధల్నే football అనుకుని, తరిమి తరిమి తన్నేయ్ Johny                  !!Life ఎంతొ చిన్నది!!
 

చిరునవ్వే గా చంద్రుని సైతం నేలకు దించే artistry
హాయిగ ఉంటే everyday ఓ holiday గా ఊర్వశి
కష్టాలు సంద్రం కాదోయ్, అవి పిల్ల కాలువలేనోయ్
ధైర్యంగా దాటితె మళ్ళీ, నీ దారిలొ రానే రావోయ్,
success కి secret ఒకటె, వదిలేసేయ్ చీకు చింతే
నిశ్చయమే తోడుగ ఉంటే, నీదే కాదా nobel బహుమతి                        !!Life ఎంతొ చిన్నది!!

నువ్వు నవ్వుతు ఉంటే...

నువ్వు నవ్వుతు ఉంటే, నువ్వు నవ్వుతు ఉంటే,
నువ్వు నవ్వుతు ఉంటే పులకించిపోయి మేఘాలు వర్షించునే
నువ్వు నవ్వుతు ఉంటే చిలకమ్మకూడ తన గొంతు కలిపేనులే
నువ్వు నవ్వుతు ఉంటే కష్టాలు అన్న మాటనే మరిచేనులే
నువ్వు నవ్వుతు ఉంటే నాతల్లి ఒడిలోన పసిపాప నైపోదులే
నువ్వు నవ్వుతు ఉంటే చూడంగ నారెండు కన్నులు చాలవులే
నువ్వు నవ్వుతు ఉంటే అనంద రాగాలు ఎల్లలు దాటేనులే
నువ్వు నవ్వుతు ఉంటే, నువ్వు నవ్వుతు ఉంటే                         !!నువ్వు నవ్వుతు ఉంటే!!

ఉదయాన్నె నవ్వేటి నవ్వులు, కావ నను మేలుకొలిపేటి వెలుగులు
కాఫీ ని అందిస్తు నవ్వులు, నాలో ఉత్సాహమే పెంచు మధువులు
ఆఫీసు కెళ్ళేప్పుడు, పెదవే దాటని నవ్వులు, 
త్వరగానె రమ్మంటు జాలిగ చేయును వినతులు,
అటుపైన ఫోనుల్లో అడపదడపా నవ్వులు, 
దూరాన ఉంటూనే నాలో రేపును వలపులు
సాయంత్ర వేళల్లో నవ్వులు, నాలో అలసటను తరిమేటి గుళికలు 
చీకట్లో మునిపంటి నవ్వులు, నాలో రేపేను ఎన్నెన్నొ కాంక్షలు
అల్లంటి అందాల అరుదైన నవ్వులన్ని
ఈ జన్మ, పై జన్మ, ప్రతి జన్మలొ నాకేసొంతం                             !!నువ్వు నవ్వుతు ఉంటే!!

చురుకైన నీ కంటి చూపులు, కూడ కురిపించు నెన్నొ నవ్వులు
తెల్లని నీ మనసు చల్లగ, నాకు అందించు వెన్నెల నవ్వులు
కోపంతొ పిచ్చిగ  నే , వేస్తూ ఉన్నా రంకెలు
శాంతంగ పెదవులపై చెరగని నీ చిరు నవ్వులు
చేప్పాయి చెప్పకనే మునుపే ఎరగని సత్యము
యుద్ధాల నాపేటి ఆయుధమే నీ నగవులు
కిలకిల మని నవ్వేటి నవ్వులు, నాతొ చెప్పించె నెన్నెన్నొ కవితలు
గలగల మని పారేటి నవ్వులు, వింటే ఆనంద సంద్రాన మునకలు
అట్లాంటి మృదువైనా మధురాల నవ్వులు అన్ని
ఈ జన్మ, మరు జన్మ, ప్రతి జన్మలొ నాకేసొంతం                       !!నువ్వు నవ్వుతు ఉంటే!!

ఐతే ఎలా, వీడూ నాలా ఐతే ఎలా?

ఐతే ఎలా, వీడు నాలా ఐతే ఎలా?
ఐతే ఎలా, వీడూ నాలా ఐతే ఎలా?
ఒకేరోజు పుట్టమని ఆ దేవుడు, ఒకే రాత రాసాడా ఏం చేయను?
dual role cinema నా ఈ జీవితం?, అలా చేసి ఉండడు అని నా నమ్మకం
అలా చేస్తే దేవుడే మరి దేవుడే ఐ ఉండడులే.                                         !!ఐతే ఎలా!!

ఆకలేస్తే పిల్లలంతా అమ్మ పాలే తాగేరంట
వద్దనన్న నేను మాత్రం మట్టి గోడలు నాకానంటా
జోల పాటకు ఆదమరచి పిల్లలంతా బజ్జుంటారుగ
నేను మాత్రం నిదరపుచ్చిన అమ్మనే పడుకోనీలేదట
కోతి పనులే చేసానట ఎన్నెన్నో ఎన్నెన్నో
అమ్మనే విసిగించానంటా ఎంతెంతో ఎంతెంతో
అందుకే ఈ వెధవ బుర్రకు  తేలనిది ఈ doubt అంటా                            !!ఐతే ఎలా!!  


నాన్న అంటే ఎవరికైనా భయమొ భక్తో ఉంటుందండి
నేను మాత్రం రెండూ మరచి నానతో పోట్లాడానండి
స్కూలు డుమ్మ కొట్టినాళ్ళు ఎందరెందరొ ఉంటారేమో
tution కూడా మాని cricketను ఆడిన ఘనత నాదేనేమో
యక్ష ప్రశ్నలు వేసేదట ఎన్నెన్నొ ఎన్నెన్నో
పిచ్చి పాటలు పాడేదంట నాదైనా బాణీలో
అందుకే ఓ చిక్కువీడని ప్రశ్న మదినే తొలిచేస్తుంది                               !!ఐతే ఎలా!!


అన్నదమ్ముల కీచులాటలు లోకమెరగని వింతేం కాదు
కానీ రోడ్డు పైనే అన్నను కొట్టిన దుష్ట చరితుణ్ణి నేనేనేమో
భర్త అంటే ఇంటి పనులల్లో భార్యకే చేయంధించాలట
నేను మాత్రం పనులు అంటే మాయచేసి hand ఇస్తానుగ
bike fast గ నడిపిస్తా banglore లో traffic లో
బద్దకంతో రోజంతా గడిపేస్తా laptop తో
అందుకే ఈ స్మృతుల వీచిక వెక్కిరిస్తూ అడుగుతు ఉంది                      !!!ఐతే ఎలా!!!

ఏడవకు పిన్నాడ ఏడవకు చంటాడ

ఏడవకు పిన్నాడ ఏడవకు చంటాడ,
ఏడవకు నా చిట్టీ తండ్రీ
ఏడ్చుకుంచూ ఉంటె వచ్చేది ఏంటి, 
కంటి నిండా నీళ్ళు చూడోయి, కడుపు నిండా పాలు కాదోయి.    !!ఏడవకు పిన్నాడ!!


మీ తాత మొకిరాల వెంకయ్య నడుగు,
కథలెన్నొ చెప్పేను ఆటలాడించేను
నానమ్మ నే అడుగు ప్రియమార నీకు
గురు లీల అమృతపు ధార అందించేను
రంపల్లి తాత నే రాగానే అడుగు
పిట్ట రావే అంటు రాగాలె తీసేను
అమ్మమనే అడుగు కాదంటె అలుగు
తన ఒడినె ఉయ్యాలగా చేసి ఊపమని
అందరూ కలిసి నీకన్నిటిని అందించ 
నిదుర పోర చిన్ని కృష్ణయ్య, అలక మానర బుజ్జి కన్నయ           !!ఏడవకు పిన్నాడ!!


తాతమ్మనే అడుగు తారంగం చెప్పేను
తనను తానే మరిచి నీతోటి ఆడేను 
పెద్దమ్మ పెదనాన్న కార్థన్ననే అడుగు
అర్జునుడు ఉలూచి కథలు వినిపించేరు
దీపమ్మ చిన్నికే ధైర్యంగ చెప్పు
నిను నిదురపుచ్చని తన గాత్ర మెందుకని
మీ అయ్య దూర్వాసున్నే నువ్వు అడుగు
పాటలింక చాలు పక్కకే చేరమని
అందరూ కలిసి నీకానందమే పంచ
కోడి కూసేదాక నిదరోయి, కోడి నిదరలు కాస్త మానోయి              !!ఏడవకు పిన్నాడ!!

Song on ten incarnations of Lord Vishu (daSaavatarms)

                                     విష్ణువు దశావతారములు
                                    ---------------------------

పిలిచినంతనే బదులు పలికే శ్రీహరా ఓ శుభకరా
శరణుయన్నచొ కరుణనొసగే శ్రీధరా ఓ శ్రీకరా
1, 2
----
ప్రేమతో మను నుద్ధరించిన మత్స్య రూప మురహరా
అసుర నిర్జన వేద రక్షణ చేసినా ఓ సురవర
కూర్మ రూపము నందు సురులకు అమృతమునందించగా
మంధరేశుని మోసినట్టి అచ్యుతా నారాయణా.                    !!పిలిచినంతనే!!
3,4
---
వరాహాకృతి దాల్చి వసుధను బ్రోచినా భువనేశ్వరా
హిరణ్యాక్షుని సంహరించగ అవతరించిన కేశవా
భక్తితో ప్రహలాదు పిలవగ కదలివచ్చిన వరప్రదా
కృఊర కర్మల హిరణ్యకశుపుని రూపుమాపిన స్థితికర        !!పిలిచినంతనే!!
5,6
----
ఇంద్ర దేవుని ఉద్ధరించిన అదితి తనయ వామనా
మూడు అడుగులు అడిగి బలినే అణగత్రొక్కిన త్రివిక్రమ
తండ్రి మరణము తలచివేయగ క్షత్రియుల కడతేర్చగా
ఇరవయ్యొక మార్లుర్వి చుట్టిన పరుషరామ పరంధామా      !!పిలిచినంతనే!!
7,8
---
పితృవాక్యమె వేదమనుకుని సత్యధర్మము శ్వాస గా
ప్రాణసఖి సీతమ్మ కొరకై పోరు సలిపిన రాఘవా
నోటిలో భువనాలు చూపిన మాధవా మధుసూదనా
సారథై ధర్మాన్ని నడిపిన శ్యామలాంగా సుదర్శన              !!పిలిచినంతనే!!
9,10
----
ఆత్మతత్వము సత్యము అహింస ఆలంబనముగా
ఇలన బుద్ధుడి రూపమందున అవతరించిన అక్షరా
విష్ణుయశసుని తనయుడై ధర్మాన్ని నిలిపే దక్షుడై
కలియుగాంతము నందు వచ్చే కల్కి రూప శ్రీరంగ            !!పిలిచినంతనే!!

To listen to this song pls check this link:
http://www.youtube.com/watch?v=g1QXpuCA_2g

సాయినాథుడి కృప తో రాసిన నా తొలి పాట


సాయీ నీ పేరు తలిచే నిత్యం జనకోటి(2)
హీనులైనా దీనులైనా, పాపులైనా పుణ్యులైనా
పూజల్లోనె కాలం గడిపే ఆస్తికులే ఐనా
దైవం అంటె దూషించేటి నాస్తికులే ఐనా
న్యాయం కోసం ప్రాణాలిచ్చే, ధర్మాత్ములైనా
రక్తం తోటి నేస్తం చేసే, రాక్షసులే ఐనా
కడుపాపులు, దోపకులు, కీచకులే ఐనా
నిజవాదులు, హరిశ్చంద్రులు , కరుణామయులైనా
సర్వ జీవకోటి ఆది నుండి అంతం వరకు
పలుకుతున్న పావన పదము ఓ సాయి నీ నామము                  !!సాయీ నీ పేరు!!

తండ్రి అనాథంటే ఎవడు, నిన్ను మరచు మూర్ఖుడికంటే
లక్షలుండి భిక్షుకుడేగా, నిన్ను లక్ష్యపెట్టకుంటే
బాబా భయం సంగతేంటి, నీవే జతగ మాతో ఉంటే
ఓటమన్న మాటంటేంటి, భారం మొత్తం నీపై మోపగ
ద్వారకమాయీ దివ్య  కొలువులో సాయీ దర్శన మయ్యిందంటే
అంతులేని సంతోషాలు సొంతం కాక ఎటు వెళ్ళేను?
విధి రాతలు విచిత్రాలు, నీ మాయలు అనన్యాలు
కాపాడయ్య తండ్రీ మమ్ము, చూపించయ్య మహిమలు మాకు       !!సాయీ నీ పేరు!!

నీ దివ్య రూపము చూడగ, చాలవు సాయి కన్నులు రెండు
నీ అంద చందం పొగడగ, లేవు సాయీ పదములు తెలుగున
ఎమో సాయీ నిన్ను వీడితే క్షణక్షణం నరకం మాకు
ప్రళయం కాక వచ్చేదేంటి ప్రభువే మమ్ము కాదనిపోతే
దత్తుడి రూపం దాల్చి నేలపై భువిలో దర్శన మిచ్చిన నీకు
లోకం మొత్తం ఏకం చేసి సేవలు చేసే వరమును ఇమ్ము
నీ దీవెన క్షణం చాలు, మా భాగ్యం అనంతాలు
శోకం స్వర్గం అన్నీ నువ్వు, నీలో నన్ను చేరనివ్వు                     !!సాయీ నీ పేరు!!

To listen to this song, check the below link:
http://www.youtube.com/watch?v=327cuPueHQY&feature=youtube_gdata