My Lyrics

కార్తికేయ మొకిరాల అంతరంగ లహరి

రామ రామా రామా, నా కిష్టం రాజు మామ
మొదలెడితే అల్లరి అమ్మ, ఇక ఉండదు fullstop comma
తాతయ్య అమ్మమ్మ మాలో ఎవరిష్టం అంటే
నానమ్మ, తాతయ్య, నా ప్రాణం ఎవరని అంటే
ఠక్కున చెప్పేస్తా నేనే, తడబాటేదీ లేకుండా
lollypop ను కొనిపెడితే, వారినె నే లవ్ చేసేస్తా..                         !!రామ రామా!!

ఉదయాన్నే లేవాలి, అందర్నీ లేపాలి
ఈనాడు పేపర్లో కథలే తిరగేయాలి
Pediasure తాగాలి, బలమెంతో రావాలి
స్నానాలే చేసేసి, స్తోత్రాలె చదవాలి
Uniform వేసుకు టక టక, dress ఐపోయి చక చక
జై ఆయుర్వేదం అంటు ఎల్చూరికి జై కొట్టి 
మమ్మీకే bye చెప్పి bike ఎక్కి వెళ్ళాళి.                                      !!రామ రామా!!

bachpanకే వెళ్ళాలి బాగా చదివేయాలి
ఆటల్లో పాటల్లో number one అవ్వాలి
బొమ్మల్నే వేయాలి రంగుల్నే దిద్దాలి
టీచర్ల applause నా సొంతం కావాలి
Ben10 యుక్తికి ధీటుగ, ఛోటా భీముకు సాటిగా 
నిలిచేటి వాడెవడంటు నిక్కచ్చిగ తేల్చాలంటే 
లోకాలె చెయ్యెత్తి నావైపే చూపాలి                                               !!రామ రామా!!

తొక్కలో ప్రేమ :)

చేజేతులా life చెడిపేసుకోకు రా, love లోన పడకురా బ్రదరూ
గాలికెళ్ళే కంప దారిలో నువ్వాపి, కాలితో తొక్కకోయ్ బ్రదరూ
Love లోన లెగ్గెడితె కష్టాలు గ్యారెంటి
నీ బతుకు కివలేడు యే ఎదవ వారెంటి
Girl friend లేకుంటె రారాజువే
Mind it, తానుంటె నీ life బేజారులే


అమ్మయిలంటేనె confusion-u
అడగకనె ఇస్తారు high tension-u
problem-mu లేని female-u ఉందా?
I love you అంటారు timepass కి
తిరిగావా అదినమ్మి ప్రతి చోటికి
Wallet ఖాళీ, అడిగిందివ్వాలి
భూకంపాలు వస్తున్నాకాని
నువ్ టైముకే ఫోను చేయాలి
లేకుంటె కన్నీళ్ళు compulsory
Trust me, మౌనాల యుద్ధాలు మొదలోయ్ మరి                       !!చేజేతులా !!


ఆడాళ్ళ మనసుల్లొ ఏముందని
గ్రహించేటీ subject లొ expert ని
భూమ్మీద brother-u, you can't find ever-u
సరదాగె ఉంటారు చూట్టానికి
తెర వెనక ఆంతర్యమే mystery
బాబోయ్ అడాళ్ళు భలె మోసగాళ్ళు
ఓ శ్రీశైల మల్లన సామీ
ఓ తిరుపతి ఏంకన్న సామీ
మీరైన చెప్పండి solution-u
Frankly, అమ్మాయ్ల కోపానికో reason-u                                     !!చేజేతులా !!