ద్వారకమాయిలో జగమేలు సాయి
చల్లన్ని చూపంట చక్కన్ని రూపంట, వెన్నంటి మనసంట కరుణించు గుణమంట
దత్తుడి రూపమే దిగి వచ్చె సద్గురై
భయమంటె సెలవంట, అభయాల నెలవంట, తానoటె ప్రేమంట, ప్రేమంటె మనమంట
రవి శశి కాంతులే తనలో మెరవగా
ఈ పంచ భూతాలే తననే చేరగా
ముక్కోటి దేవతలు ఒక్కటై సాయిగా
అవతరించి రీ భువి పై ఆశ్రితులను కాపాడగ !!ద్వారక మాయిలో!!
సంద్రానికి సైతం ఉంటుందొక తీరం
నీకరుణకు ఎక్కడుంది స్వామీ ఆ తీరం?
ప్రతివాడిలొ కోపం ఎదో ఒక రూపం
నీ మోమున ఏమూలన లేదయ్యా ఆ లోపం
ఆదిలోన సాయి అంటె తెలియని ఈ దీనునికి, సాయిలోని హాయి చూపి నీవాడిగ చేసితివి
కష్టకాలమందు నన్ను కంటి రెప్ప లా చూసి, చెప్పలేని తీర్చలేని ఋణ పాత్రుణి చేసితివి
శతకోటి వందనములు సాయి నీ చరణములకు
కరుణించి ఈ దీనుని కాపాడగ కదలిరావ? !!ద్వారక మాయిలో!!
నినుకొలిచిన పూవులు సిరులై మము చేరును
నీ దీవనలకు సరితూగే సిరులేవి ఉండవులే
మే చేసిన ప్రార్థనలు వరములు గా సిద్ధించును
కలవరములు కడతేరును స్వామీ నీ కరుణతో
లోకమందు నిన్ను మించి బంధువు ఎవరుంటారని, నీదు పాదపద్మ మందు నా హృదయము కొలువుంచి
కాళ్ళ నుండి వెల్లివిరుయు గంగమ్మను నే తాకి, చేసిఉన్న పాపమంత తొలిగిపోవు తరుణముకై
శతకోటి నేత్రములతొ నే వేచి చూచు చుండ
దయతోడ ఈ దాసుని దరిచేర్చగ కదలిరావ? !!ద్వారక మాయిలో!!

No comments:
Post a Comment