My Lyrics

Song on ten incarnations of Lord Vishu (daSaavatarms)

                                     విష్ణువు దశావతారములు
                                    ---------------------------

పిలిచినంతనే బదులు పలికే శ్రీహరా ఓ శుభకరా
శరణుయన్నచొ కరుణనొసగే శ్రీధరా ఓ శ్రీకరా
1, 2
----
ప్రేమతో మను నుద్ధరించిన మత్స్య రూప మురహరా
అసుర నిర్జన వేద రక్షణ చేసినా ఓ సురవర
కూర్మ రూపము నందు సురులకు అమృతమునందించగా
మంధరేశుని మోసినట్టి అచ్యుతా నారాయణా.                    !!పిలిచినంతనే!!
3,4
---
వరాహాకృతి దాల్చి వసుధను బ్రోచినా భువనేశ్వరా
హిరణ్యాక్షుని సంహరించగ అవతరించిన కేశవా
భక్తితో ప్రహలాదు పిలవగ కదలివచ్చిన వరప్రదా
కృఊర కర్మల హిరణ్యకశుపుని రూపుమాపిన స్థితికర        !!పిలిచినంతనే!!
5,6
----
ఇంద్ర దేవుని ఉద్ధరించిన అదితి తనయ వామనా
మూడు అడుగులు అడిగి బలినే అణగత్రొక్కిన త్రివిక్రమ
తండ్రి మరణము తలచివేయగ క్షత్రియుల కడతేర్చగా
ఇరవయ్యొక మార్లుర్వి చుట్టిన పరుషరామ పరంధామా      !!పిలిచినంతనే!!
7,8
---
పితృవాక్యమె వేదమనుకుని సత్యధర్మము శ్వాస గా
ప్రాణసఖి సీతమ్మ కొరకై పోరు సలిపిన రాఘవా
నోటిలో భువనాలు చూపిన మాధవా మధుసూదనా
సారథై ధర్మాన్ని నడిపిన శ్యామలాంగా సుదర్శన              !!పిలిచినంతనే!!
9,10
----
ఆత్మతత్వము సత్యము అహింస ఆలంబనముగా
ఇలన బుద్ధుడి రూపమందున అవతరించిన అక్షరా
విష్ణుయశసుని తనయుడై ధర్మాన్ని నిలిపే దక్షుడై
కలియుగాంతము నందు వచ్చే కల్కి రూప శ్రీరంగ            !!పిలిచినంతనే!!

To listen to this song pls check this link:
http://www.youtube.com/watch?v=g1QXpuCA_2g

సాయినాథుడి కృప తో రాసిన నా తొలి పాట


సాయీ నీ పేరు తలిచే నిత్యం జనకోటి(2)
హీనులైనా దీనులైనా, పాపులైనా పుణ్యులైనా
పూజల్లోనె కాలం గడిపే ఆస్తికులే ఐనా
దైవం అంటె దూషించేటి నాస్తికులే ఐనా
న్యాయం కోసం ప్రాణాలిచ్చే, ధర్మాత్ములైనా
రక్తం తోటి నేస్తం చేసే, రాక్షసులే ఐనా
కడుపాపులు, దోపకులు, కీచకులే ఐనా
నిజవాదులు, హరిశ్చంద్రులు , కరుణామయులైనా
సర్వ జీవకోటి ఆది నుండి అంతం వరకు
పలుకుతున్న పావన పదము ఓ సాయి నీ నామము                  !!సాయీ నీ పేరు!!

తండ్రి అనాథంటే ఎవడు, నిన్ను మరచు మూర్ఖుడికంటే
లక్షలుండి భిక్షుకుడేగా, నిన్ను లక్ష్యపెట్టకుంటే
బాబా భయం సంగతేంటి, నీవే జతగ మాతో ఉంటే
ఓటమన్న మాటంటేంటి, భారం మొత్తం నీపై మోపగ
ద్వారకమాయీ దివ్య  కొలువులో సాయీ దర్శన మయ్యిందంటే
అంతులేని సంతోషాలు సొంతం కాక ఎటు వెళ్ళేను?
విధి రాతలు విచిత్రాలు, నీ మాయలు అనన్యాలు
కాపాడయ్య తండ్రీ మమ్ము, చూపించయ్య మహిమలు మాకు       !!సాయీ నీ పేరు!!

నీ దివ్య రూపము చూడగ, చాలవు సాయి కన్నులు రెండు
నీ అంద చందం పొగడగ, లేవు సాయీ పదములు తెలుగున
ఎమో సాయీ నిన్ను వీడితే క్షణక్షణం నరకం మాకు
ప్రళయం కాక వచ్చేదేంటి ప్రభువే మమ్ము కాదనిపోతే
దత్తుడి రూపం దాల్చి నేలపై భువిలో దర్శన మిచ్చిన నీకు
లోకం మొత్తం ఏకం చేసి సేవలు చేసే వరమును ఇమ్ము
నీ దీవెన క్షణం చాలు, మా భాగ్యం అనంతాలు
శోకం స్వర్గం అన్నీ నువ్వు, నీలో నన్ను చేరనివ్వు                     !!సాయీ నీ పేరు!!

To listen to this song, check the below link:
http://www.youtube.com/watch?v=327cuPueHQY&feature=youtube_gdata