My Lyrics

పితృ దేవోభవ

పితృ దేవోభవ అని, పలుమార్లు స్తుతించి, జీవనం పావనం కానీ
గుండె నిండున్న మానాన్న రూపాన్ని ధ్యాన్నించి శిరసొంచి ప్రణమిల్లనీ
కోపం వచ్చిందా ముక్కంటికి మరో రూపు
ప్రేమే పొంగిందా హద్దన్నది లేనే లేదు
ఈ మమతల సౌధానికి ఆలంబన నాన్నా నువ్వు
నీ చల్లని దీవెనలు శ్రీరామ రక్షే మాకు                                                             !!పితృ దేవోభవ!!

వేలుపట్టి నడిపినా జుట్టు పట్టి కొట్టినా
అంతా నా మంచికి నువు సలిపిన కృషి కాదా
ముద్దులెన్నొ పెట్టినా రెట్టింపుగ తిట్టినా
అంతా నాకొరకే అని మరువగ నే మనిషినా
కరుకగు మేఘం వెనువెంటనె చల్లని వర్షం
దురుసగు కోపం తెరవెనకే ప్రేమల తీరం
చెబుతున్న ఈ మాటను నాన్నా పది మందిలో
వద్దన్న కొడుకై నే పుడతా ప్రతి జన్మ లో                                                          !!పితృ దేవోభవ!!

ఉలితో కొట్టకుండా మెరుగులనే దిద్దకుండా
శిల శిల్పంగా మారుట సాధ్యమైన పనికాదుగ
చెడునే తృంచకుండా సన్మార్గము చూపకుండా
దృతరాష్ట్ర ప్రేమలతో లక్ష్య సాధనే కల్లని
భావించావు తప్పులనే సరిదిద్దావు
వెదురగు నన్ను వేణువుగా మార్చేసావు
అందుకె నువ్వందుకొ నా శతకోటి వందనాలు
అంతెరగని ఋణ సాగర మునకలొ ఓ చిరు పాలు                                               !!పితృ దేవోభవ!!

No comments:

Post a Comment