నువ్వు నవ్వుతు ఉంటే, నువ్వు నవ్వుతు ఉంటే,
నువ్వు నవ్వుతు ఉంటే పులకించిపోయి మేఘాలు వర్షించునే
నువ్వు నవ్వుతు ఉంటే చిలకమ్మకూడ తన గొంతు కలిపేనులే
నువ్వు నవ్వుతు ఉంటే కష్టాలు అన్న మాటనే మరిచేనులే
నువ్వు నవ్వుతు ఉంటే నాతల్లి ఒడిలోన పసిపాప నైపోదులే
నువ్వు నవ్వుతు ఉంటే చూడంగ నారెండు కన్నులు చాలవులే
నువ్వు నవ్వుతు ఉంటే అనంద రాగాలు ఎల్లలు దాటేనులే
నువ్వు నవ్వుతు ఉంటే, నువ్వు నవ్వుతు ఉంటే !!నువ్వు నవ్వుతు ఉంటే!!
ఉదయాన్నె నవ్వేటి నవ్వులు, కావ నను మేలుకొలిపేటి వెలుగులు
కాఫీ ని అందిస్తు నవ్వులు, నాలో ఉత్సాహమే పెంచు మధువులు
ఆఫీసు కెళ్ళేప్పుడు, పెదవే దాటని నవ్వులు,
త్వరగానె రమ్మంటు జాలిగ చేయును వినతులు,
అటుపైన ఫోనుల్లో అడపదడపా నవ్వులు,
దూరాన ఉంటూనే నాలో రేపును వలపులు
సాయంత్ర వేళల్లో నవ్వులు, నాలో అలసటను తరిమేటి గుళికలు
చీకట్లో మునిపంటి నవ్వులు, నాలో రేపేను ఎన్నెన్నొ కాంక్షలు
అల్లంటి అందాల అరుదైన నవ్వులన్ని
ఈ జన్మ, పై జన్మ, ప్రతి జన్మలొ నాకేసొంతం !!నువ్వు నవ్వుతు ఉంటే!!
చురుకైన నీ కంటి చూపులు, కూడ కురిపించు నెన్నొ నవ్వులు
తెల్లని నీ మనసు చల్లగ, నాకు అందించు వెన్నెల నవ్వులు
కోపంతొ పిచ్చిగ నే , వేస్తూ ఉన్నా రంకెలు
శాంతంగ పెదవులపై చెరగని నీ చిరు నవ్వులు
చేప్పాయి చెప్పకనే మునుపే ఎరగని సత్యము
యుద్ధాల నాపేటి ఆయుధమే నీ నగవులు
కిలకిల మని నవ్వేటి నవ్వులు, నాతొ చెప్పించె నెన్నెన్నొ కవితలు
గలగల మని పారేటి నవ్వులు, వింటే ఆనంద సంద్రాన మునకలు
అట్లాంటి మృదువైనా మధురాల నవ్వులు అన్ని
ఈ జన్మ, మరు జన్మ, ప్రతి జన్మలొ నాకేసొంతం !!నువ్వు నవ్వుతు ఉంటే!!
No comments:
Post a Comment