సీత మహా లక్ష్మి
శ్రీ దత్త, షణ్ముఖ, లలిత ఆతమజ నీకు
శ్రీకరమగు బ్రతుకు సిద్దించు జో లాలి. !! సీత మహా లక్ష్మి!!
గణనాధుడగణిత సుగుణములను ఇచ్చి
ఘన కీర్తి యశములు తానందించి
గాంధర్వ గానాలు తానాలపించి
గతియయ్ నిను బ్రోవ నిదురించు మా తల్లి !! సీత మహా లక్ష్మి!!
ఇలవేల్పు నారసిమ్హ విభుడె కరుణించి
సతితోడ నిను చూసి శౌర్యాన్నందించి
యాగప్రియ రాగమే పాడి శుభ
యోగములొసగేను పవళించు మా తల్లి !! సీత మహా లక్ష్మి!!
భిక్షేస్వర స్వామి కృప నీకు తోడుండ
భయమన్న భావనకె కలిగేను భయమంట
దాక్షాయని నీకు ధైర్యము తోపటు
విజయములందించ నిదురించు నా తల్లి !! సీత మహా లక్ష్మి!!
రామయ్య కన్నులొ కొలువున్న రమణి
రనివ్వకేలోటు తమ రక్ష నీకనీ
రామప్రియ రాగమే పాడి నిన్ను
జో లాలి అంటోంది అదివిని తరించు !! సీత మహా లక్ష్మి!!

No comments:
Post a Comment